DSC Updates : గత సోమవారం (ఆగస్టు 5)తో తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. దీంతో పరీక్షకీ పేపర్ కోసం అభ్యర్థులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొన్ని పేపర్లు ఈజీగా వచ్చాయని అభ్యర్థులు చెబుతుండగా, ఇంకొన్ని టఫ్‌గా వచ్చాయని అంటున్నారు. ఈజీగా ప్రశ్నపత్రం వస్తే మార్కుల కటాఫ్ పెరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 80 మార్కులకు డీఎస్సీ పరీక్ష జరిగింది. 20 మార్కులను టెట్ పరీక్షలో వచ్చిన మార్కులకు అనుగుణంగా కేటాయిస్తారు. కటాఫ్ ఎంత వస్తుంది ? టెట్‌లో వచ్చిన మార్కులు కలుపుకుంటే తమకు ఎన్ని మార్కులు రావొచ్చు ? అనేది ఇప్పుడు అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వారికి ఫుల్ క్లారిటీ రావాలంటే కీ పేపర్ విడుదలయ్యే దాకా వేచిచూడాల్సిందే. ఈనెల రెండోవారం లేదా మూడోవారంలో డీఎస్సీ కీ పేపర్ విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు(DSC Updates) 2,45,263 మంది హాజరయ్యారు. అయితే అప్లై చేసిన వారిలో దాదాపు 34,694 మంది పరీక్షలు రాయలేదు. డీఎస్సీ ద్వారా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 220 పోస్టులు, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి.తొలుత ఆన్సర్ కీని విడుదల చేస్తారు. దానిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ రూపొందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. సెప్టెంబరు 5వ తేదీ నాటికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన ఉపాధ్యా అభ్యర్ధులకు అపాయింట్‌మెంట్ లెటర్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఫలితాలను త్వరగా విడుదల చేయడం వీలుకాకపోతే సెప్టెంబరు మూడోవారానికి రిజల్ట్స్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే అక్టోబర్ నాటికి నియామకాలు పూర్తవుతాయి.
Also Read :Health Tips : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదా.. ఇంట్లో ఇవి ఉంచుకోండి
తెలంగాణలో వచ్చే ఏడాది జనవరిలో లేదా ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈక్రమంలో ఈ ఏడాది డిసెంబరులో టెట్‌ను నిర్వహించనున్నారు. టెట్ జరిగిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌నను విడుదల చేేసే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి 19,717 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చారు. వారిలో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలు ఉన్నారు. పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు వచ్చే అవకాశం లేదు. దీంతో 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు తేలినట్లు విద్యాశాఖ చెబుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200 నుంచి 300 మంది వరకు టీచర్లు పదవీ విరమణ పొందుతుంటారు.