Whats Today : తెలంగాణ అసెంబ్లీ సెషన్ షురూ.. అమల్లోకి ‘మహాలక్ష్మి పథకం’

Whats Today : తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

Published By: HashtagU Telugu Desk
Whats Today

Whats Today

Whats Today : తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ తెలంగాణ మంత్రులకు కాంగ్రెస్ సర్కారు శాఖలను కేటాయించనుంది.
  • ఈరోజు నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుంది. దీన్ని అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌‌లలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంటుంది.
  • ఇవాళ విజయవాడలోని రాయనపాడులో జరిగే వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనానికి హాజరవుతారు.
  • ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల నుంచి మళ్లీ నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
  • బాపట్ల జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటిస్తారు. మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడి, నష్టం వివరాలు తెలుసుకుంటారు.
  • విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో జరగనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొంటారు.
  • విశాఖలోని సింహాచలం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఇవాళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తారు. విశాలాక్షి నగర్‌లో వికసిత భారత్ సంకల్ప యాత్రలో(Whats Today) పాల్గొంటారు.

Also Read: Missile -Bapatla : బాపట్ల తీరంలో మిస్సైల్.. ఎక్కడిది ?

  Last Updated: 09 Dec 2023, 07:26 AM IST