Whats Today : కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
- ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఆరు గ్యారంటీలు, ప్రజాపాలన కార్యక్రమంపై వారిలో చర్చించనున్నారు. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
- ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారు. తొలుత ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఇడుపులపాయ ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాద్రిపురానికి జగన్ చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
- పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ బహిష్కృత నేతలు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ద్వాదశి సందర్భంగా తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు చక్రస్నానం నిర్వహించనున్నారు.
- సర్వదర్శనం భక్తులకు ఇవాళ(Whats Today) వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్నారు.