Whats Today : మూడు నూతన క్రిమినల్ కోడ్ బిల్లులను ఇవాళ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ మూడు బిల్లులు చట్టాలుగా అమల్లోకి మారనున్నాయి. వీటికి బుధవారమే లోక్‌సభ ఆమోదం తెలిపింది.
- కాంగ్రెస్ సర్కారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది.
- ఇవాళ(Whats Today) ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరగబోతోంది. దీనికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు.
- ఇవాళ సింగరేణి ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయనుంది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అధికార పార్టీ గెలుపు కోసమే ఎన్నికల వాయిదాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ చింతపల్లిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్‌లలోని 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు.
- ఈరోజు నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు జనవరి 10తో ముగియనుంది.
- ఇవాళ తిరుమలలో ఉదయం 10 గంటలకు మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. వీటిని టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- ఇవాళ భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా కృష్ణావతారంలో స్వామి వారు దర్శనమిస్తారు.
- ఇవాళ భారత్- దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే జరుగుతుంది. పార్ల్ వేదికగా సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 3 వన్డేల సిరీస్ లో 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి.