Site icon HashtagU Telugu

Smart Phone : ఏంటి..? స్మార్ట్ ఫోన్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. ఫోన్ ని ఎన్ని ఏళ్ళు వాడాలో తెలుసా?

What.. Smart Phones Also Have An Expiry Date.. Do You Know How Many Years You Can Use The Phone..

What.. Smart Phones Also Have An Expiry Date.. Do You Know How Many Years You Can Use The Phone..

Smart Phone Expiry Day : రోజురోజుకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో 9 మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా చాలామంది స్మార్ట్ ఫోన్ల పైన డిపెండ్ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ద్వారా ఒక్క క్లిక్‌తో ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ (Smart Phone) కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తాం. ఫోన్ ధర ఎంత స్టోరేజ్ కెమెరా ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మరీ కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే స్మార్ట్ ఫోన్ కి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అన్న విషయం మీకు తెలుసా ?

We’re now on WhatsApp. Click to Join.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి ఆ వివరాల్లోకి వెళితే.. స్మార్ట్ ఫోన్ ని ఎంతో జాగ్రత్తగా వాడితే కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా వేస్ట్ యాప్ లను ఇన్స్టాల్ చేస్తూ అనవసరమైన వాటికి ఉపయోగిస్తే తక్కువ సమయంలోనే స్మార్ట్ ఫోన్లు చెడిపోతాయి. స్మార్ట్‌ ఫోన్ అనేది విద్యుత్ ద్వారా నడిచే పరికరం. స్మార్ట్‌ఫోన్‌కు గడువు తేదీ లేనప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది పాడైపోతుంది. స్మార్ట్‌ఫోన్ వయస్సు దాదాపు రెండున్నరేళ్లు. కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లు అంతకంటే తక్కువగా ఉండవచ్చు.

స్మార్ట్‌ఫోన్ పెద్ద లేదా చిన్న బ్రాండ్ ఆధారంగా, దాని వయస్సు ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆపిల్ ఫోన్ 4-8 సంవత్సరాలు సౌకర్యవంతంగా ఉంటుంది. శామ్సంగ్ ఫోన్ 3-6 సంవత్సరాలు మాత్రమే సరిగ్గా ఉపయోగించబడుతుంది. బ్యాటరీ పాడైతే ఫోన్ సరిగ్గా పని చేయకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలలో ఉపయోగించే రసాయనాలు కొంత సమయం తర్వాత క్షీణించి, బ్యాటరీ చెడిపోతుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వెనుక ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీని ఎంతసేపు చార్ట్ చేయాలి అనేది కూడా రాసి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ గడువు తేదీ కూడా దాని బ్యాటరీ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. పాడైన బ్యాటరీని మార్చడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం కాస్త కష్టంగా మారింది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకోవడానికి కొత్త మార్గంలో పోరాడాయి. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన 2-3 సంవత్సరాల తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రావడం ఆగిపోతుంది. కాబట్టి కొంత సమయం తర్వాత మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి. ఇది మాత్రమే కాదు, కంపెనీలు 2-3 సంవత్సరాల తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సెసరీలను తయారు చేయడం కూడా ఆపివేస్తారు. అందుకే ఈ ఫోన్లకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.

Also Read:  Heartburn: గుండెలో మంటగా ఉందా..? అయితే కారణాలు ఇవే..!