Site icon HashtagU Telugu

Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

Ktr Jubilee Hills Bypoll Ca

Ktr Jubilee Hills Bypoll Ca

ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి నకిలీ ఓటర్ల అవసరం లేదని, ఇప్పటికే ఉన్న నిజమైన ఓటర్లే బీఆర్ఎస్ పాలనకు తగిన తీర్పు ఇచ్చారనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేశారు. ప్రజల నమ్మకమే కాంగ్రెస్ బలమని, అబద్ధాలు రాయించి ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీకి మామూలైన రాజకీయ వ్యూహమని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

నిజాలు ఏంటంటే… బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఓటర్ ఐడీ కార్డుల ముద్రణకు మాత్రమే అనుమతించబడిన సిస్టమ్ను దుర్వినియోగం చేశారు. రాష్ట్ర ఐటీ & సి శాఖ ఎన్నికల సంఘం అనుమతి లేకుండా 2 లక్షల 16 వేల ఓటర్ల EPIC ఫోటోలను యాక్సెస్ చేసి Pension Life Certificate System (PLCS) పేరుతో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత వ్యవస్థలో ఉపయోగించింది. ఈ సిస్టమ్ 2019 నుండి 2021 మధ్య పనిచేసిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డేటా వాడకానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకపోవడం పెద్ద నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడింది. దీనివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించిందనే ఆరోపణలు తలెత్తాయి.

కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నదేమిటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కలిసి ఓటర్ డేటాను వాడి నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించడానికి కుట్ర చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి చేసిన ఘోరమైన ద్రోహమని, ఓటర్ల హక్కులపై జరిగిన దాడిగా ఖండించారు. ఇక ఇప్పుడు అదే పార్టీ ఇతరులపై ఆరోపణలు చేయడం దౌర్భాగ్యమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజల నమ్మకంతోనే తమ ప్రభుత్వం నడుస్తుందని, బీఆర్ఎస్ చేసిన ఈ డేటా దుర్వినియోగాన్ని ఎప్పటికీ మర్చిపోమని, దీనిపై చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

Exit mobile version