BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంటి..? – మంత్రి దామోదర రాజనర్సింహ

మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ […]

Published By: HashtagU Telugu Desk
Damodar

Damodar

మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పలువురు రాజకీయ నేతలు రకరకాలుగా స్పందించడం ఫై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవొచ్చు అని తెలిపారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యలపై మా ప్రభుత్వాన్ని వచ్చి ఎవరు కలిసిన మేము దానికి స్పందిస్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

ఇక ఈరోజు బుధువారం మంత్రి సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హై స్కూళ్లలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి రక్త పరీక్షలు చేస్తాం అని, రక్త హీనత తక్కువగా ఉంటే అందుకు కావలసిన ఐరన్ టాబ్లెట్ లు ఇస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి కార్యక్రమం ఆందోల్ నియోజకవర్గంలో ప్రారంభించామన్నారు.

Read Also : Naked Man Festival : 10వేల మంది నగ్న పురుషుల పోటీ.. 40 మంది మహిళలకు ఎంట్రీ !

  Last Updated: 24 Jan 2024, 01:02 PM IST