BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ భిక్షాట‌న !!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండ‌మావిగా క‌నిపిస్తోంది. రాజ్యాధికారానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌మ‌ని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్రాధేయ‌ప‌డుతున్నారు. వివిధ కార‌ణాల‌తో పార్టీని వీడిన నాయ‌కులు తిరిగి రావాల‌ని ప‌దేప‌దే కోరుతున్నారు.

  • Written By:
  • Updated On - January 29, 2023 / 12:40 PM IST

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండ‌మావిగా క‌నిపిస్తోంది. రాజ్యాధికారానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌మ‌ని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్రాధేయ‌ప‌డుతున్నారు. వివిధ కార‌ణాల‌తో పార్టీని వీడిన నాయ‌కులు తిరిగి రావాల‌ని ప‌దేప‌దే కోరుతున్నారు. ఇక ఏపీ బీజేపీ నిలువునా చీలిపోయింది. రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశానికి మాజీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ర్గం దూరంగా ఉంది. బీజేపీ చేప‌డుతోన్న ప్రోగ్రామ్స్ కూడా హ్యాండిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర చేశారు. ఫ‌లితంగా బీజేపీ బ‌ల‌ప‌డింద‌ని భావిస్తున్నారు. కానీ, వాపును చూసి బ‌లుపు అనుకుంటోంద‌ని ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 17 లోక్ స‌భ స్థానాల్లో నిల‌బ‌డేందుకు అభ్య‌ర్థులు కూడా బీజేపీ లేరు. ఆ విష‌యం స‌ర్వ‌త్రా తెలిసిందే. ప్ర‌త్యేకించి ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ బ‌ల‌హీనం అంద‌రికీ తెలుసు. అందుకే, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు చేరిక‌ల క‌మిటీని ఈటెల‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి త‌దితుల‌తో ఏర్పాటు చేశారు. నెలవారీగా టార్గెట్ పెట్టారు. ఈడీ, సీబీఐ దాడులతో ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల్ని భ‌య‌పెట్టారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీకి వెళ్ల‌డానికి ఇత‌ర పార్టీల లీడ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన శ్రావ‌ణ్ వారం రోజులు కూడా తిర‌క్కుండా బీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక డీకే అరుణ‌, జితేంద‌ర్ రెడ్డి, విజ‌య‌శాంతి, త‌దితరులు పైకి చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ లోలోన బండి సంజ‌య్ ఏక‌ప‌క్ష వాల‌కాన్ని జీర్ణించుకోలేక పోతున్నార‌ని వాళ్ల అనుచ‌రుల్లోని టాక్‌. ఎన్నిక‌ల నాటికి ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్లిన సీనియ‌ర్లు తిరిగి సొంత‌గూళ్ల‌కు చేరుకుంటార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పైగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న బీజేపీలోని గ్రూప్ రాజ‌కీయం లోలోన మండుతోంది. క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా బండి సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ ఒక వ‌ర్గం ఢిల్లీ వ‌ర‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీనియ‌ర్ల‌తో. కూడిన మ‌రో వ‌ర్గం క‌క్క‌లేకి మింగ‌లేక ఉంది. ఇలాంటి ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఇత‌ర పార్టీల లీడ‌ర్లు ఎవ‌రూ బీజేపీ వైపు చూడ‌డంలేదు.

Also Read: Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

వాస్త‌వంగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి బీజేపీలో చేర‌తార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ పార్టీలోని తాజా ప‌రిణామాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌రువాత ఆయ‌న ఆచితూచి అడుగు వేస్తున్నారు.బ‌హుశా ఆయ‌న ఇత‌ర పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. అందుకే, చేరిక‌ల క‌మిటీ మీద ఢిల్లీ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. ఆ క‌మిటీ బాధ్యులుగా ఉన్న కొండా విశ్వేశ్వర‌రెడ్డి దాదాపు మౌనంగా ఉన్నారు. ఒక్క ఈటెల మాత్రం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోతున్నారు.

తెలంగాణ‌కు భిన్నంగా ఏపీ బీజేపీ ప‌రిస్థితి ఉంది. అక్క‌డ అధ్య‌క్షుడిని మార్చేయాల‌ని ప‌లువురు బాహాటంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, వీర్రాజు బ‌దులుగా ఎవ‌రికి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాలి? అనే దానిపై ఢిల్లీ పెద్ద‌లు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నారు. ఆ రాష్ట్రంలో కేవ‌లం 2శాతానికి మించి ఓటు బ్యాంకు క‌మ‌లానికి లేదు. ఆ విష‌యం స‌ర్వ‌త్రా అంద‌రికీ తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్రాంతీయ పార్టీల మీద ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది. వివిధ ర‌కాలు కేసులు, ఆబ్లిగేష‌న్లు న‌డుమ ప్రాంతీయ పార్టీలు బీజేపీకి లొంగి ఉన్నాయి. ఈ ప‌రిణామం ఎన్నిక‌ల నాటికి పోతుంది. దీంతో ఇప్పుడు ఉంద‌నుకుంటోన్న 2శాతం ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీ దక్కే ప‌రిస్థితి లేదు. అందుకే, సోము వీర్రాజు బ‌దులుగా ఎవ‌ర్ని పెట్టిన‌ప్ప‌టికీ వేస్ట్ అనే ధోర‌ణి ఆ పార్టీ పెద్ద‌ల్లో ఉంద‌ని తెలుస్తోంది.

భాజపా నాయకురాలు, మాజీ నటి విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీని ఉదహరించారు. రాజకీయ జీవితంలో ఉన్న‌ స్థాయికి చేరుకోవడం బీజేపీలోనే సాధ్యం అంటూ వినిపించారు. ఇత‌ర ప్రాంతీయ పార్టీల్లో సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసే అవకాశం బీజేపీలో మాత్రమే సాధ్యమే తప్ప ప్రాంతీయ పార్టీల్లో కాదని బండి సంజయ్ అన్నారు. అందుకే, బీజేపీలో చేరండ‌ని ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను ప్రాధేయ‌ప‌డుతున్నారు.