తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana assembly Session) నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా పలు అంశాల ఫై గురించి ప్రస్తావించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని..ఆయనను కలుస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందన్నారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని, రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు.ఈరోజు బీఏసీ సమావేశానికి కేసీఆర్ రావాల్సి ఉండగా హరీశ్ వచ్చారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు.
కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని దుయ్య బట్టారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామని.. విధానపరమైన లోపాలు లేకుండా పాలనను కొనసాగిస్తున్నామని తెలియపరు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంత మంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘విజయసాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. KRMBకి ప్రాజెక్టులను అప్పగించింది గత ప్రభుత్వమేనని రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్ డ్యాంను ఏపీ పోలీసులు ఆక్రమిస్తే కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. సాగర్‌ను జగన్ పోలీసులతో ఆక్రమించారని… అప్పుడు కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకుని వెళుతుంటే.. కేసీఆర్ అడ్డుకోలేదన్నారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవని కేసీఆర్.. ఆయన కమిట్‌మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎల్‌వోపీ మార్పు స్పీకర్ నిర్ణయం అని తెలిపారు. సభలో కులగణన తీర్మానం ఉంటుందన్నారు. అంశాలు చర్చించాల్సిన అవసరం అనుకుంటే సభను పొడిగించవచ్చని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also : Nirmal : నిర్మల్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..పెళ్లికి నో చెప్పిందని గొడ్డలితో నరికి చంపాడు