Trump Vs Mitr Clinic: మన దేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం తొలి క్లినిక్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. దీని పేరు.. మిత్ర్ క్లినిక్. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఈ క్లినిక్ మూత పడింది. నారాయణగూడ చౌరస్తా సమీపంలోని వైఆర్‌జీ ఫార్మసీ పక్కన చిన్న సందులో ఈ క్లినిక్ ఉంది. జనవరి 27 నుంచే ఈ క్లినిక్ మూసివేసి ఉంది. హైదరాబాద్‌లో 2021 మార్చిలో ప్రారంభమైన మిత్ర్ క్లినిక్ .. మార్చి 14 నుంచి శాశ్వతంగా మూతపడుతుందని తెలిసింది. ఎక్కడో అమెరికాలో నిర్ణయం తీసుకుంటే.. హైదరాబాద్‌లో క్లినిక్ ఎందుకు మూతపడింది ? తెలుసుకుందాం..
Also Read :Aurangzeb : అబూ ఆజ్మీ వ్యాఖ్యలపై దుమారం.. ఔరంగజేబు గురించి ఏమన్నారు ?
‘యూఎస్ ఎయిడ్’ సాయం ఆపేయడంతో..
అమెరికా ప్రభుత్వంలోని ‘యూఎస్ ఎయిడ్’ విభాగం ద్వారా చాలా ప్రపంచదేశాలకు ఏటా ఆర్థికసాయం అందుతుంటుంది. ఇలా సాయం పొందే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. యూఎస్ ఎయిడ్ నిధులను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌లో నడుస్తున్న మిత్ర్ క్లినిక్ మూతపడింది. ఎందుకంటే ఈ క్లినిక్ నిర్వహణకు ఇప్పటివరకు యూఎస్ ఎయిడ్ నుంచే నిధులు అందేవి. అమెరికా సెనేట్‌లో సెనేటర్ జాన్ కెన్నడీ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో యూఎస్ ఎయిడ్ నిధులతో ట్రాన్స్‌జెండర్ క్లినిక్ నడుస్తోంది. ఈవిషయం అమెరికన్లకు తెలియదు. అమెరికన్లు చెల్లించిన పన్నులతో మాజీ అధ్యక్షుడు బైడెన్(Trump Vs Mitr Clinic) వృథా ఖర్చులు చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
హైదరాబాద్‌లోని మిత్ర్ క్లినిక్ ట్రాన్స్‌జెండర్లకు ‘వన్-స్టాప్ సెంటర్’గా ఉండేది. దీనికి ప్రతినెలా 200 నుంచి 250 మంది వచ్చి సేవలు పొందుతుంటారు. ఇప్పటివరకు 4వేల మంది క్లయింట్స్ రిజిస్టర్ అయ్యారు.ఇక కరీంనగర్‌లోని మిత్ర క్లినిక్ హెల్ప్ డెస్క్‌లో 541 మంది సేవల కోసం నమోదు చేసుకున్నారు.