Site icon HashtagU Telugu

Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

Union Finance Minister Nirmala Sitharaman Telangana Debts Parliament Lok Sabha

Telangana Debts: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభ వేదికగా కీలక వివరాలను వెల్లడించారు.  ఒకప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రమని, ఇప్పుడిది అప్పుల కుప్పగా మారిందన్నారు.  ఏపీ విభజన నాటికి తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాయని నిర్మల చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్నో ప్రాజెక్టుల ద్వారా దాని వికాసానికి చేతనైనంత చేదోడును అందించిందని తెలిపారు.  ‘‘నేను ఏ పార్టీనీ తప్పు పట్టడం లేదు’’ అని అంటూనే చాకచక్యంగా నిర్మలా సీతారామన్(Telangana Debts) ఈ కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.

Also Read :Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే.. 

Also Read :Mother Of All Bombs: ఇజ్రాయెల్ చేతికి ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’.. ఏమిటిది ? ఎందుకోసం ?