Site icon HashtagU Telugu

BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?

Bjp Mp Ticket

Bjp Mp Ticket

BJP MP Ticket : మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీ ఎందుకు పెండింగ్‌లో పెట్టింది ? మాజీ మంత్రి డీకే అరుణకు ఆ సీటును ఇంకా ఎందుకు కేటాయించలేదు ? అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలోని 9 పార్లమెంట్ స్థానాలకు ఫస్ట్ లిస్టులోనే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ .. కీలకమైన మహబూబ్ నగర్‌ సీటుపై ఇంకా ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో ముడిపడిన మరిన్ని వివరాలు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డి ఒకసారి బీజేపీ తరపున, మరోసారి బీఆర్ఎస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. అందుకే ఇపుడు ఆయన అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జితేందర్ రెడ్డిని కాదని.. డీకే అరుణకు ఆ టికెట్ (BJP MP Ticket) ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సంకోచిస్తోందని సమాచారం. జితేందర్ రెడ్డికి ఏదో ఒకరకంగా నచ్చజెప్పి.. డీకే అరుణను పాలమూరు బరిలో నిలబెట్టాలని కాషాయ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట.

3.33 లక్షల ఓట్లతో.. 

గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ.. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అప్పట్లో ఆమెకు 3.33 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ సారి  అదే నియోజవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికలకు కూడా దూరంగా ఉండిపోయారు. పార్టీ హైకమాండ్‌తో తనకున్న సంబంధాల కారణంగా ఫస్ట్ లిస్టులోనే మహబూబ్ నగర్ టికెట్ దక్కుతుందని డీకే అరుణ భావించారు. కానీ అలా జరగలేదు. ఈ పరిణామాన్ని డీకే అరుణ, ఆమె అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read :Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు

కేంద్ర మంత్రి పదవిపై గురి

ఈసారి ఎంపీగా గెలిస్తే.. కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ కోసం ప్రయత్నం చేయొచ్చనే ఆలోచనలో డీకే అరుణ ఉన్నారని తెలుస్తోంది. అందుకే డీకే అరుణ తన సొంత అసెంబ్లీ నియోజక వర్గమైన గద్వాలలో పోటీ చేయకుండా,  బీసీ అభ్యర్దికి టికెట్ ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది.

Also Read :Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్