Site icon HashtagU Telugu

Ration Cards: వారి రేష‌న్ కార్డులు తొల‌గిస్తాం.. మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌క‌ట‌న‌!

Ration Cards

Ration Cards

Ration Cards: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో 16వ వార్డులో సన్నబియ్యం రేషన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.

మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే రేషన్ కార్డులు (Ration Cards) ఇచ్చింది. కానీ, మన ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను అందించబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తుంది” అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. “గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసి పేదల భూములను లాక్కుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి దగాకు చెక్ పెట్టింది. అనర్హుల రేషన్ కార్డులను తొలగించి, అసలైన అర్హులకు మాత్రమే కార్డులు అందేలా చేస్తాం” అని తెలిపారు.

Also Read: Diet plan : ఆయుర్వేదం ఆధారంగా మారుతున్న కాలానికి 7 రోజుల ఆహార ప్రణాళిక..

రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు బియ్యం దందా చేసే మాఫియాకు చెక్ పడింది. ధనవంతులు తినే సన్నబియ్యమే పేదలు కూడా తినాలనేది మా సంకల్పం. గతంలో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది వస్తువులు ఇచ్చాం. ఆ పరిస్థితిని మళ్లీ తీసుకొస్తాం అని శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది, నిజమైన అర్హులకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.

సన్నబియ్యం రేషన్ పంపిణీ అనేది పేదలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమం. ఈ పథకం ద్వారా సన్న బియ్యం రేషన్ కార్డు దారులకు సబ్సిడీ ధరలో లేదా ఉచితంగా అందజేయబడుతుంది. దీని ఉద్దేశ్యం ఆహార భద్రతను నిర్ధారించడం, ధనవంతులు తినే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం.