Telangana Assembly : బీఆర్ఎస్ తెలంగాణలో స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని సూచిస్తోంది. లేకుంటే అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బ్లాక్ చేశారని… స్పీకర్ ప్రజాస్వమ్యబద్ధంగా పని చేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.
Read Also: CM Revanth Reddy : తానెవరో తెలియకుండానే సీఎం పదవికి ఎంపిక చేస్తారా?: సీఎం రేవంత్ రెడ్డి
దళిత స్పీకర్ ను అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదని హరీశ్ అన్నారు. స్పీకర్ ను కలిశామని… రికార్డులు తీయాలని అడిగామని చెప్పారు. 15 నిమిషాలు అయినా వీడియో రికార్డును స్పీకర్ తెప్పించలేదని విమర్శించారు. జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సభ మీది కాదని అందరిదీ అని అన్నారు. ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు అని అనడంతో దుమారం రేగింది.
స్పీకర్‌ను ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. దళితులంటే గౌరవం లేదని అందుకే బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో కూర్చొందని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ను దూషించేలా జగదీష్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని మండిపడ్డారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టారు. జగనదీష్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని నిలదీశారు. సభలో అందరికీ సమానం హక్కులు ఉన్నాయని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు.