Site icon HashtagU Telugu

State Funds : సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

We will hold a dharna in Delhi if the occasion arises: CM Revanth Reddy

We will hold a dharna in Delhi if the occasion arises: CM Revanth Reddy

State Funds : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకే నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీ పోతాం.. తప్పేంటని సీఎం ప్రశ్నించారు. సందర్భం వస్తే నిధుల విషయంలో ఢిల్లీలోనైనా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నామని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల

బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి నిధులు రాకూడదని చూస్తోంది. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధులపై చర్చకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిద్ధం కావాలి. చర్చకు నేను, భట్టి విక్రమార్క రావడానికి సిద్ధంగా ఉన్నాం. అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్‌రెడ్డికి సన్మానం సన్మానం చేస్తామని అన్నారు. మెట్రో తెచ్చానన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డినే నిధులు అడుగుతున్నాం. ఎన్‌హెచ్‌ భూసేకరణకు అడ్డుపడుతున్నది ఈటల రాజేందర్ కాదా? భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నప్పుడు మాతో కదా చర్చించాలి. కేంద్ర మంత్రలు హైదరాబాద్‌ వచ్చి సమీక్షలు పెడితే కిషన్‌ రెడ్డి ఎందుకు రాలేదు. కేసీఆర్‌ బాధపడుతారని కిషన్‌రెడ్డి రాలేదా? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమీక్ష పెడితే ఎందుకు రాలేదు? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. హైదరాబాద్‌ అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని మేం భావిస్తున్నాం.

మందకృష్ణ బీజేపీ నేతలా మాట్లాడితే ఎలా? గతంలో ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గకరణ అంశం వర్తించదు. ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కేటీఆర్‌, కిషన్‌రెడ్డి కలిసి తిరుగుతున్నారని నేను చెబుతున్నా అని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా?పీసీసీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను గద్దెదింపి అధికారంలోకి వచ్చాం. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లలో ప్రాజెక్టులు కట్టిఉంటే.. ఇప్పుడు ఏపీతో సమస్య వచ్చేది కాదు. మందకృష్ణ మాదిగ అంటే నాకు గౌరవం ఉంది. పోటీ పరీక్షల ఫలితాలకు రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Read Also: Pink Tiolets In Rajamahendravaram : మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు…వసతులు చూస్తే షాకే!