Revanth Reddy : కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా – రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

Published By: HashtagU Telugu Desk
Revanth Nkd

Revanth Nkd

గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో దూకుడు కనపరుస్తున్న రేవంత్..నేడు ఆరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా నారాయణపేట లో రోడ్ షో లో మాట్లాడుతూ..చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని తెలిపారు.

రాష్ట్రంలో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ తో పాటు ఆయన కొడుకు, ఆయనకు కూతురు ఉండడానికి కూడా ఇల్లు కట్టిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలసొమ్ము దోచుకున్న కేసీఆర్ నుండి లక్షకోట్లు కక్కిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల ఆలోచన చేసి అనుమతులు తెచ్చిందే కీ.శే.చిట్టెం నర్సిరెడ్డి అని తెలిపారు. ఇక్కడి చెరువులు నిండాలని, కోస్గి, దామరగిద్ద ప్రాంతాలకు నీళ్లు రావాలని నిధులు తెచ్చింది తనే అని అన్నారు. చిట్టెం నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి చివరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే బస్టాండ్ లో తిని బజారులో పడుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కలవాలంటే రాయచూరు వెళ్లాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్దెర జీతగాడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పర్ణికకు వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లే అన్నారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డిని రాయచూరు పంపుదాం.. కేసీర్ ను ఫామ్ హౌస్ కు పంపుదాం అన్నారు.

Read Also : Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు..

  Last Updated: 26 Nov 2023, 04:59 PM IST