Site icon HashtagU Telugu

BRS-TRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు..ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

We will contest in the name of TRS and not BRS in the next elections

We will contest in the name of TRS and not BRS in the next elections

Errabelli Dayakar Rao: బీఆర్ఎస్‌(brs) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ9Jangaon)లో జరిగిన రైతు సదస్సు(Farmers Conference)లో పార్టీ పేరు మార్పు(Party name change) అంశంపై స్పందించారు. భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తునారు..అని ప్రకటించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల్లో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. అయితే వాస్తు అనేది నమ్మకమని.. కానీ పార్టీ పేరును మార్చడం అనేది చాలా ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని గులాబీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అ పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించడం వల్ల ఆ పార్టీ అస్థిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో గట్టి నమ్మకం ఏర్పడింది.

Read Also: Karnool YSRCP: కర్నూలులో తలనొప్పిగా మారుతున్న లోకల్‌-నాన్‌లోకల్‌ వార్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయపార్టీగా దేశంలో అగ్గిపెడతానని కేసీఆర్ నమ్మకంతో ప్రకటించేవారు. పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రంలో బిఆర్ ఎస్ తరఫున అనే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినా పోటీ చేయలేదు. చివరికి కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది.

Read Also: Ashwini Sree : హీరోయిన్ గా మారుతున్న బిగ్‌బాస్ భామ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చాలా మంది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే .. పేరు మార్పు వల్లే ఓడిపోయామని. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కడియం శ్రీహరి వంటి వారు మూడు నెలల కిందటే డిమాండ్ చేశారు. చివరికి ఆయన కూడా పార్టీ మారిపోయారు. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గిరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలనేది చాలా మంది హైకమాండ్‌కు చెబుతున్న మాట. ఆ తర్వాత చాలా మంది నేతలది అదే అభిప్రాయం. ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ ను బట్టి.. పార్టీ పేరు మళ్లీ టీఆర్‌ఎస్‌ గా మారనుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ఆ పార్టీ ప్రారంభించినట్లగా తెలుస్తోంది.