CM Revanth Tweet : తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. తొలి ఏడాది సక్సెస్ : సీఎం రేవంత్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్(CM Revanth Tweet) చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Style

CM Revanth Style

CM Revanth Tweet :  ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.  ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేశామని ఆయన చెప్పారు. ఈసందర్భంగా ఆయన ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం.. 

Also Read :Fake Doctors Exposed : 100 మంది ఫేక్ డాక్టర్లు దొరికారు.. జనం ప్రాణాలతో చెలగాటం

  • ‘‘నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంటలకు బోనస్, ఉద్యోగాల కల్పన, రాష్ట్రానికి పెట్టుబడుల స్వీకరణ వంటి అంశాల్లో మీ  ప్రభుత్వం రికార్డు సృష్టించింది’’ అని రేవంత్ తెలిపారు. 
  • ‘‘మహిళలకు ఉచిత బస్సు వసతిని కల్పించాం. ఇళ్లకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.  రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.
  • ‘‘25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం.  రూ. 21వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రైతుల సన్న బియ్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. అది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ.  రైతులకు 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు.
  • రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని సీఎం అన్నారు. 

Also Read :Mee Seva App : నేడే విడుదల.. 150 రకాల పౌరసేవలతో ‘మీసేవ’ యాప్‌

  • ‘‘ఒక్క ఏడాదిలో యువతకు 55వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించాం. తెలంగాణలో గత 12 ఏళ్లలో అత్యల్ప నిరుద్యోగిత రికార్డు కావడం ఇదే తొలిసారి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్(CM Revanth Tweet) చెప్పారు.
  • ‘‘తెలంగాణకు పెట్టుబడులు గత 11 నెలల్లో 200 శాతానికిపైగా పెరిగాయి’’ అని ఆయన తెలిపారు. 
  • క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకుగానూ అర్బన్ రీఇమేజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు భారతదేశంలోనే మొదటి నగరంగా హైదరాబాద్‌ను మార్చినట్లు సీఎం రేవంత్ చెప్పారు. 
  • హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్లు, తదుపరి దశ మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. 
  • భారతదేశపు మొట్టమొదటి సమగ్ర కుల సర్వేలో భాగంగా తెలంగాణ పౌరుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు రేవంత్ తెలిపారు. 
  • దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో త్వరలో ట్రాన్స్‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. 
  • డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని రేవంత్ చెప్పారు. 
  Last Updated: 08 Dec 2024, 11:55 AM IST