Ponnam Prabhakar : రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం – మంత్రి పొన్నం

Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు

Published By: HashtagU Telugu Desk
Minister Ponnam

Minister Ponnam

తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) రాష్ట్రంలోని రైతులకు, భూమి లేని పేదలకు ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt ) ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద రైతులకు రూ. 12 వేలు అందించాలని నిర్ణయించమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమైన పథకాలను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేస్తోందని , మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కీ గ్యాస్ అందించడం వంటి పథకాలతో ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం మాకు గర్వకారణం అని మంత్రి వెల్లడించారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని మంత్రి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో మేము ఎప్పటికీ వెనుకడుగు వేయము. భూమి లేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలు అందించడమే అందుకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మంత్రి ఆరోపించారు. “రైతుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను విమర్శించే ముందు, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆ పథకాలు అమలు చేశారా? రైతుల రుణమాఫీ, సన్న వడ్ల బోనస్ వంటి కార్యక్రమాలు ఎక్కడైనా తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మేము ప్రజల కోసం ఇచ్చిన మాట తప్పము. రైతుల సంక్షేమానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని వాటిని కేవలం విమర్శించడమే కాదు, వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

Read Also : CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్

  Last Updated: 06 Jan 2025, 11:47 AM IST