హైదరాబాద్‌లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్యాంకర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయని చెబుతున్నారు.
హైదరాబాద్‌పై వేసవికాలం ప్రభావం కనిపిస్తోంది.. బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీళ్లకు డిమాండ్ పెరిగింది. నగరంలో ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.. కొద్దిరోజులుగా బుకింగ్‌లు బాగా పెరిగాయి. ఈ క్రమంలో వాటర్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట గృహ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాణిజ్య అవసరాల కోసం నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నీళ్ల ట్యాంకర్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో రోజుకు ఏకంగా 11వేలకు పైగా ట్రిప్పుల నీళ్లు డెలివరీ చేస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్ అందిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు.
గ్రేటర్ నగర పరిధిలో 30 ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. నిజాంపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట, మణికొండ, గచ్చిబౌలి, టీఎన్‌జీఓస్ కాలనీ, షేక్‌పేట వంటి ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 11,233 ట్యాంకర్ల ద్వారా 11 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మొత్తం 84 ఫిల్లింగ్ స్టేషన్ల వారీగా సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ విభాగం ద్వారా డాష్ బోర్డును సిద్ధం చేయించారు. ఒకవేళ బుకింగ్‌లు ఏవైనా పెండింగ్‌లో ఉంటే తెలిసేలా ప్రణాళిక చేశారు.
వంద లోపు బుకింగ్స్ పెండింగ్ ఉంటే ఒక రంగు, అదే 200 వరకు పెండింగ్ ఉంటే మరో రంగు, 200లకు పైగా ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటే మరో రంగు ఉండేలా రూపొందించారు. ఇలా ట్యాంకర్లకు సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతున్నాయి. ఒకవేళ పెండింగ్ ఉంటే.. ఆయా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వారీగా అధికారులను అలర్ట్ చేస్తారు. రోజువారీ బుకింగ్‌లతో పాటు డెలివరీ, పెండింగ్ ఉన్నవి సులువుగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా బుకింగ్స్ పెండింగ్ ఉంటే కారణాలు తెలుసుకుని వారికి 24 గంటల్లోగా ట్యాంకర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా ట్యాంకర్లు పంపేందుకు అర్ధరాత్రి వరకు ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అవసరమైన చోట్ల ఫిల్లింగ్ స్టేషన్లను పెంచారు.
