హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాల నేరాలు మరోసారి కలకలం సృష్టించాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దుండగులు సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30,000 నగదు దోచుకెళ్లారు. బాధితులు ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ 13 రోజుల క్రితమే […]

Published By: HashtagU Telugu Desk
Another Nepali Gang in Hyderabad: Massive Robbery

Another Nepali Gang in Hyderabad: Massive Robbery

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాల నేరాలు మరోసారి కలకలం సృష్టించాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దుండగులు సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30,000 నగదు దోచుకెళ్లారు.

బాధితులు ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ 13 రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నారు. సోమవారం రాత్రి పనిమనిషి పుట్టినరోజు అని చెప్పి, కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వారి స్నేహితులుగా మరో ఐదుగురిని ఇంటికి పిలిచారు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి, తాళ్లతో కట్టేశారు. “మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి” అని బాధితులు వేడుకున్నా వినకుండా, వారికి మత్తుమందు ఇచ్చి ఓ గదిలో బంధించారు.

అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును దోచుకుని, సాక్ష్యాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు. మంగళవారం మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన దంపతులు కిటికీ నుంచి కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి వారిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్‌గిరి డీసీపీ సుమతి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

  Last Updated: 13 May 2026, 09:56 AM IST