కేసీఆర్ జైలు..బండి నాలుక కోత‌..తెలంగాణలో పొలిటిక‌ల్ హీట్

`ట‌చ్ చేసి చూడు..జైలుకు పంపిస్తావ్‌..నాలుక కోస్తా...` ఇదీ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుప‌డుతూ చేసిన వ్యాఖ్య‌లు. అవే వ్యాఖ్య‌ల‌ను మ‌ళ్లీ బీజేపీ బ‌లంగా వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 05:41 PM IST

`ట‌చ్ చేసి చూడు..జైలుకు పంపిస్తావ్‌..నాలుక కోస్తా…` ఇదీ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుప‌డుతూ చేసిన వ్యాఖ్య‌లు. అవే వ్యాఖ్య‌ల‌ను మ‌ళ్లీ బీజేపీ బ‌లంగా వినిపిస్తోంది. ఖ‌చ్చితంగా కేసీఆర్ జైలుకు వెళ్ల‌తాడ‌ని బండి, ధ‌ర్మ‌పురి బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఆయ‌న అవినీతి గురించి ఎక్క‌డ చెప్పాలో..అక్క‌డ చెబుతారం..జైలుకు పంపిస్తాం..అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ అంటున్నారు. న‌కిలీ పాస్ పోర్టులు, స‌హారా కుంభ‌కోణం, కాళేశ్వ‌రం అవినీతి త‌దిత‌రాల‌ను ప్ర‌స్తావించారు. కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీజేపీ మ‌ళ్లీ చెప్ప‌డంతో రాజ‌కీయం వేడిక్కింది.

తెలంగాణ బీజేపీ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, దుబ్బాక ఎన్నిక‌ల నుంచి దూకుడుగా వెళుతోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని బండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆ రోజున పొలిటిక‌ల్ స‌ర్టిక‌ల్ స్ట్రైక్ గురించి మాట్లాడాడు. సుమారు 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని బాహాటంగా ఆనాడు బండి చెప్పాడు. అదే స‌మ‌యంలో కేసీఆర్ జైలుకు వెళ‌తాడ‌ని కూడా వ్యాఖ్యానించాడు. రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి విచార‌ణ చేయ‌డానికి ఎవ‌రొస్తారో చూడండంటూ గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బండి చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ మండుతున్నాయి.

Also Read : BJP Vs TRS : వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కేసీఆర్

ఆ వ్యాఖ్య‌ల‌కు మ‌రింత ఆజ్యం పోస్తూ ఇప్పుడు మ‌ళ్లీ కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ స్లోగ‌న్ అందుకున్నారు బీజేపీ నేత‌లు. హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత కేసీఆర్ మీద విమ‌ర్శ‌నాస్త్రాల‌ను పెంచారు. వ్య‌క్తిగ‌తంగా కేసీఆర్ మీద దాడికి దిగారు. ప‌చ్చి తాగుబోతుగా కేసీఆర్ ను అభివ‌ర్ణించారు. తెలంగాణ ద్రోహిగా ఆయ‌న్ను గుర్తించాల‌ని కోరుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ చేసిన దీక్ష వెనుక ఉన్న మోసాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు, రైతుల‌ను ఎలా మోసం చేస్తున్నాడో ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించారు. స‌చివాల‌యానికి రాకుండా ఫాంహౌస్ లో ప‌డుకుని తెలంగాణ‌కు ద్రోహం చేసిన మొద‌టి వ్య‌క్తి కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ చీఫ్.

హుజురాబాద్ ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత రెండు రోజుల వ‌ర‌కు మౌనంగా కేసీఆర్ ఉన్నాడు. కొన్ని నెల‌లుగా కేసీఆర్ మీడియాకు దూరంగా ఉన్నాడు. హ‌ఠాత్తుగా మీడియా ముందుకు వ‌చ్చిన కేసీఆర్ బీజేపీ చీఫ్ మీద విరుచుకుప‌డ్డాడు. నోరు జారితే, అంతుచూస్తామంటూ హెచ్చ‌రించాడు. ఇక నుంచి ప్ర‌తి రోజూ మీడియా ముందుకొస్తానంటూ కేసీఆర్ చెప్పాడు. రాష్ట్ర‌, కేంద్ర బీజేపీ అంతుచూస్తానంటూ స‌వాల్ విసిరాడు. పేద‌ల‌కు కేంద్రం చేసిన ద్రోహాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ హీటెక్కింది. ఒక వైపు కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ బీజేపీ చెబుతుంటే..ఇంకో వైపు కేంద్ర, రాష్ట్ర బీజేపీ అంతుచూస్తానంటూ తెలంగాణ సీఎం వార్నింగ్ ఇవ్వ‌డం స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు దారిస్తోంది.