Vote for Note :`ఓటుకునోటు`ఓ స్టంట్! రేవంత్ రెడ్డి `ట‌ర్నింగ్` పాయింట్ అదే.!

ఓటుకు నోటు కేసు(Vote for Note) ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే ప్ర‌శ్న‌లు

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 02:29 PM IST

ఓటుకు నోటు కేసు(Vote for Note) ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే ప్ర‌శ్న‌లు వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం అంద‌రికీ తెలిసిందే. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి ధ్రువీక‌ర‌ణ కాన‌ప్ప‌టికీ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాటిలో ప్ర‌ధాన‌మైన‌ది ఆ కేసులో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎపిసోడ్‌. కేసు న‌మోదు కావ‌డానికి ఆయ‌న అప‌రిప‌క్వ రాజ‌కీయ మేధావిత‌నం అంటూ టీడీపీ వ‌ర్గాల్లోని కీల‌క వ్య‌క్తుల మ‌ధ్య ఇప్ప‌టికీ న‌లుగుతోంది. ఆ ఎపిసోడ్ తో తెలుగుదేశం పార్టీకి భారీ న‌ష్టం వాటిల్లింది. రాజ‌కీయంగా, ఆర్థికంగా రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎదిగార‌ని టీడీపీ కోర్ టీమ్ వ‌ర్గాల్లోని టాక్‌.

ఓటుకు నోటు కేసు ఎవ‌రికి లాభం? (Vote for Note)

వాస్త‌వంగా ఓటు నోటు(Vote for Note) కేసు ఇటీవ‌ల జ‌రిగిన ఫామ్ హౌస్ ఎపిసోడ్ కంటే పెద్ద‌దేమీ కాదు. ఆ రోజున చంద్ర‌బాబు ధైర్యంగా నిల‌బ‌డ‌లేక రేవంత్ రెడ్డిని పెద్దోడ్ని చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు ఫోన్ ట్యాపింగ్ ఆనాడు జ‌రిగింది. దాని మీద పోరాటం చేయ‌కుండా చంద్ర‌బాబు రాజీధోర‌ణికి వెళ్లార‌ని లోగుట్టు అంశం. అందుకే, ఓటుకు నోటు కేసు త‌రువాత తిరుగులేని రాజ‌కీయ‌వేత్త‌గా కేసీఆర్ ఎదిగారు. స‌మాంత‌రంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగిపోతున్నారు.

Also Read : Revanth Reddy Comments: నేనే సీఎం.. మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి!

ఆ రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ‌ద్ద‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక‌టిన్న‌ర గంట పాటు మంతనాలు సాగించాల్సిన అవ‌స‌రంలేదు. పోనీ, ఆ గంట‌న్న‌ర స‌మ‌యం ఆయ‌న మాట్లాడిన మాట‌ల వీడియో ఆధారంగా ఓటుకు నోటు కేసుకు సంబంధంలేని అంశాలే మాట్లాడారు. రాబోవు రోజుల్లో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం చేతుల్లోకి తెలంగాణ రాజ‌కీయం వ‌స్తుంద‌ని, మిగిలిన వాళ్లు వ‌యోభారంతో క‌నుమ‌రుగు అవుతార‌ని ఏవేవో మాట్లాడారు. భవిష్య‌త్ లో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం నుంచి జైపాల్ రెడ్డి త‌ర‌హాలో వెలిగిపోతాన‌ని క‌థ‌లు చెబుతూ గంట‌న్న‌ర‌పాటు అక్క‌డ ఉన్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఏసీబీ వ‌చ్చే వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు.

బీజేపీ-టీఆర్ఎస్ గ‌త కొన్నేళ్లుగా ఆడుతోన్న గేమ్

తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్ప‌కుండానే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సెబాస్టియ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడ‌ని తెలంగాణ టీడీపీలోని కీల‌క సీనియ‌ర్లు ఇప్ప‌టికీ అంటుంటారు. అక్క‌డ నుంచి చంద్ర‌బాబుకు ఫోన్ ఎందుకు చేశారు? అనేది కూడా ప‌లు అనుమానాల‌ను తావిచ్చే అంశంగా టీడీపీలో ఉంది. మొత్తం మీద రేవంత్ ఆ కేసులో అరెస్ట్ కావ‌డం ఆ త‌రువాత ఆయ‌న కుమార్తె పెళ్లి బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు దంప‌తులు మోసారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల మంత్రి మ‌ల్లారెడ్డి క్లియ‌ర్ గా చెప్పిన విష‌యం విదిత‌మే. ఇదంతా బీజేపీ-టీఆర్ఎస్ గ‌త కొన్నేళ్లుగా ఆడుతోన్న గేమ్ ను విశ‌దీక‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంది.

Also Read : CBN in surveillance : చంద్ర‌బాబు స‌భ‌ల‌పై ఢిల్లీ నిఘా నేత్రం!

ఏపీలో చంద్రబాబు విషయమే తీసుకుంటే, ఆయన మీద అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ అన్నీ నిరాధారామే. చంద్రబాబుకు ఒక వీక్ నెస్ ఉంది. రాజకీయ నాయకుల అందరిలోకి తనే నికార్సయిన వాడినని , అవినీతి లేని వాడినని , ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదని చూపించుకోవా లనే తాపత్రయం ఉంది. ఆ బలహీనత మీద దెబ్బ వెయ్యాలనే ప్రయత్నం బీజేపీ చేసిందట. దానికి సహకరిస్తానని కె.సి.ఆర్ అప్ప‌ట్లో ఇచ్చిన హామీ మేర‌కు జాయింట్ ఆపరేషన్ లో భాగ‌మే ఓటుకునోటు అంటూ ఇటీవ‌ల ఆనోటాఈనోటా వినిపిస్తోంది.

రేవంత్ రెడ్డికి ట్రాప్ వేసి , చంద్రబాబును ఇరికించార‌ని టీడీపీ లీడ‌ర్లు

రాజ‌కీయ గేమాడేందుకు టీఆర్ఎస్ ఒక టీమ్ ఉంద‌ట‌. ఆ టీమ్ లోని వాళ్లే పిలిచి అవినీతిని ప్రోత్సహిస్తారు. తలూపిన వాళ్లు దగ్గరకు రాగానే పోలీసులతో ప‌ట్టించ‌డం ఆ టీమ్ ప్ర‌త్యేక‌త‌. దీన్నే పోలీసు భాష‌లో చెప్పుకోవాలంటే హానీ ట్రాప్ అంటారు. అలా రేవంత్ రెడ్డికి ట్రాప్ వేసి , చంద్రబాబును ఇరికించార‌ని టీడీపీ లీడ‌ర్లు విశ్వ‌సిస్తారు. ఓటుకు నోటు కేసు లోతుల్లోకి వెళితే కేసు నిలబడదు. కానీ బాబు పిరికి మనస్తత్వం కలవాడని, పరువు కోసం పాకులాడుతాడని బీజేపీ, టీఆర్ఎస్ ద్వయం ఎత్తుగడ వేసి ఒక రాయి విసిరింద‌ట‌. ఇక్కడ‌ బాబు గట్టిగా నిలబడి ఎదిరిస్తే కె.సి.ఆర్ ప్రభుత్వం కూలి పోయేది.

Also Read :Revanth Reddy: ఢిల్లీకి చేరిన ₹. 30 కోట్ల ఫిక్సింగ్, టీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మ‌క్కు..!

ఒక సీఎం ఫోన్ టాపింగ్ చేయడం నేరం. అలా చేసాడని ఒకప్పుడు కర్ణాటక సి. ఎం రామకృష్ణ హెగ్డీ తన సి.ఎం పదవికి రాజీనామా చేయవల్సి వచ్చింది. అదే సూత్రం ఇక్కడ కె.సి.ఆర్ కు అమలు అయ్యేది. చంద్రబాబు మౌనం వహించడంతో , హీరోలా కె.సి.ఆర్ నిలబడ్డాడు . అదే చంద్రబాబుకు మైనస్ అయ్యి 2019 లో ఓటమికి కారణ మయ్యింది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి నేనే కేంద్రం పై తిరుగుబాటు దారుణ్ణి అంటూ బ‌య‌లు దేరారు. కానీ దేశంలో ఏ రాష్ట్ర నాయకుడూ కె.సి.ఆర్ ను నమ్మడం లేదంట. ఇదంతా బీజేపీ తో లోపాయికారీ ఒప్పందంలో భాగమే అని అనుమానిస్తున్నారు. ఎక్కడి కక్కడ ఓట్ల చీలికలతో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే అని చెబుతున్నారట. ఆప్ , ఎం.ఐ.ఎం , బి.ఎస్.పి అయినా అన్నీ విడి విడిగా పోటీ చేసి బి.జె.పి కి లబ్ధి చేకూర్చ‌డానికే. దేశంలో అత్యధిక ధనవంతమైన బీజేపీ త‌న మనుగడ కోసం కేంద్ర నిఘా సంస్థలను అనుకూలంగా మలచుకుని దాడులు చేయిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.