Site icon HashtagU Telugu

Revanth – Vivek : మళ్లీ కాంగ్రెస్‌లోకి వివేక్.. ? రేవంత్‌తో భేటీ

Revanth Vivek

Revanth Vivek

Revanth – Vivek : బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.  వివేక్ వెంకటస్వామితో తెలంగాణ కాంగ్రెస్  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌‌లో ఉన్న వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి గన్‌‌మెన్‌ లేకుండానే  రేవంత్ వెళ్లారు. ఈసందర్భంగా రేవంత్‌, వివేక్ దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా వివేక్‌ను రేవంత్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో.. ఇక వివేక్ కూడా హస్తం పార్టీకి జైకొడతారనే ప్రచారానికి ఈ సమావేశం బలాన్ని చేకూర్చింది. ఇప్పటికే వివేక్ సోదరుడు గడ్డం వినోద్‌కు కాంగ్రెస్ పార్టీ  బెల్లంపల్లి అసెంబ్లీ టికెట్‌ను ఖరారు చేసింది. ఒక లోక్‌సభ టికెట్ హామీతో ఇక వివేక్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఒకసారి పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డు వివేక్‌కు ఉంది. ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి ఏ లోక్‌సభ టికెట్‌ను అడుగుతారు అనేది ఆసక్తికరంగా(Revanth – Vivek) మారింది.

Also Read: Salman Khan -Phantom Face Pain : సల్మాన్‌ఖాన్‌ను వేధించిన ‘ఫాంటమ్ ఫేస్ పెయిన్’.. ఏమిటిది ?