తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు అందజేసి ఆకట్టుకుంది. ఫ్రీ బస్సు సౌకర్యానికి మహిళలనుండి విశేష స్పందన వస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా TSRTC రికార్డ్స్ నమోదు చేస్తుంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది ఒక రికార్డే అంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఇందుకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కూడా ఒక కారణమని చెప్తున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడం కూడా… ఆ రోజు ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చని చెప్తున్నారు. ఆలయాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు… ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా వినియోగించినట్టు చెప్తున్నారు.
ఇదిలా ఉంటె ఆర్డినరీ , పల్లె , ఎక్స్ ప్రెస్ లలో ఫ్రీ సౌకర్యం ఉండడం తో ఎక్కువగా మహిళలు అందులోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ సూపర్ లగ్జరీ , హైటెక్ బస్సు లలో ప్రయాణించేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి అవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సూపర్ లగ్జరీ లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు..ఇప్ప్డుడు ఎక్స్ ప్రెస్ లలో ఫ్రీ సర్వీస్ అందుబాటులోకి రావడంతో కాస్త ఆలస్యమైనా అందులోనే పోదామని భవిస్తూ..వాటికోసమే ఎదురుచూసి అందులో ప్రయాణం చేస్తున్నారు కానీ సూపర్ లగ్జరీ బస్సు లలో మాత్రం ఎక్కడం లేదు. మరి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ కి మరింత నష్టం వాటిల్లడం ఖాయం.
Read Also : Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. వారికి పదవులు కష్టమే..?