Vijayashanti: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి విజయశాంతిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే తెలంగాణ పీసీసీ పంపిన లిస్టులో కానీ, సీఎం రేవంత్ చేసిన సిఫారసుల్లో కానీ విజయశాంతి పేరు లేదు. ఇంతకీ ఈ అవకాశాన్ని రాములమ్మ ఎలా దక్కించుకున్నారు ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరైనా ముఖ్య నేతల సిఫారసు వల్లే విజయశాంతికి ఈ అవకాశం దక్కి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆమె 2009 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యురాలిగా సేవలు అందించారు. విజయశాంతి కూడా 2009 నుంచి 2014 మధ్యకాలంలోనే పార్లమెంటు సభ్యురాలిగా వ్యవహరించారు. బహుశా అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది.
Also Read :Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?
మీనాక్షి సిఫార్సు వల్లే
మీనాక్షి నటరాజన్ సిఫార్సు వల్లే ఎమ్మెల్సీ పదవికి విజయశాంతి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చేసి ఉండొచ్చని అంటున్నారు. అందుకే ఈ అంశంపై బహిరంగంగా విమర్శలు చేసేందుకు కూడా కాంగ్రెస్ నేతలెవరూ సాహసించడం లేదని సమాచారం. విజయశాంతి(Vijayashanti) ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసే రోజున, పక్కనే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. ఈ అంశం సీఎం రేవంత్ వర్గీయులకు మింగుడుపడటం లేదట. మధు యాష్కీకి నేరుగా ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి.
Also Read :Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి పోలీసుల నోటీసులు
త్వరలోనే మంత్రి పదవి ?
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి త్వరలోనే మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం మొదలైంది.తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు లేదా తర్వాత మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. హోం శాఖ లేదా విద్యాశాఖను ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తొలుత బీఆర్ఎస్, బీజేపీలలో పని చేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2024 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని విజయశాంతి భావించినా, ఛాన్స్ దక్కలేదు.