Vijayashanthi : కేసీఆర్ ఓటమి చెందడం ఫై బాధ వ్యక్తం చేసిన విజయశాంతి

పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయి ఉండవచ్చు

Published By: HashtagU Telugu Desk
Vijayashanthi Kcr

Vijayashanthi Kcr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయగా..గజ్వేల్ లో ఈటెల రాజేందర్ ఫై భారీ మెజర్టీ తో విజయం సాధించగా..కామారెడ్డి లో మాత్రం ఓటమి చెందారు. బిజెపి అభ్యర్థి చేతిలో రెండో స్థానానికే పరిమితమయ్యారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ సైతం ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేసీఆర్ ఎమ్మెల్యే గా ఓటమి చెందడం ఫై కాంగ్రెస్ నేత విజయశాంతి (Vijayashanthi) స్పందించారు. ‘ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణల బీఆర్ఎస్ పార్టీని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం.

మొదట కేసీఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం ఎదరుచూస్తున్నది.’ అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

Read Also : Prakash Raj : కేసీఆర్ కు ధైర్యం చెపుతూ ప్రకాష్ రాజ్ ట్వీట్

  Last Updated: 05 Dec 2023, 04:06 PM IST