Site icon HashtagU Telugu

vijayashanthi : బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు – విజయశాంతి

vijayashanthi

vijayashanthi

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) ఓటమి ఖాయమని..ఇది నేను చెపుతున్న మాట కాదని..ప్రీ పోల్ సర్వే (Telangana Pre Poll Survey) లు చేబోతున్న మాట అన్నారు బిజెపి నేత విజయశాంతి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారా (Telangana Assembly Election) మోగింది. నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) ఎన్నికల కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటీకే గులాబీ బాస్ తన ప్రచార షెడ్యూల్ ను విడుదల చేయగా..కాంగ్రెస్ సైతం బస్సు యాత్రకు సిద్ధం అవుతుంది. ఇక బిజెపి నేతలు సైతం వరుస పర్యటనలు చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో బీజేపీ నేత విజయశాంతి..బిఆర్ఎస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. ప్రీపోల్ సర్వేల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతున్నాయన్నారు. ఈ అహంకార పూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో మార్పు తప్పదన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచన మారుతుందన్న విజయశాంతి…ఈసారి బీఆర్ఎస్ కు గుణపాఠం చెబుతారని తాను అనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Read Also :  8 Days – 108 Deaths : ఆ ఆస్పత్రిలో 8 రోజుల్లో 108 మరణాలు.. కారణమేంటి ?