Hyderabad: రీల్స్ కోసం బైక్‌ స్టంట్ , యువకుడు మృతి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడు కలిసి మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై యువకులు మోటార్‌బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. కొందరు కేవలం థ్రిల్ కోసం మాత్రమే కాకుండా మరిన్ని సోషల్ మీడియాలో లైకులు, షేర్ ల కోసం ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు.సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడం కోసం నగర యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో యువకుడు బైక్ తో విన్యాసాలు చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

కస్టపడి చదువుకోవాల్సిన వయసులో కొందరు యువకులు పెడదారిన పడుతున్నారు. వేలకు వేలు పెట్టి చదివిస్తున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన తీరు దీనికి అద్దం పడుతుంది. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్‌లో బైక్ స్టంట్స్ చేస్తూ యువకుడి మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడు కలిసి మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బైక్ నడుపుతున్న శివ ఆదివారం మృతి చెందాడు. వర్షం కారణంగా రోడ్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. యువకుడు బైక్ తో విన్యాసాలచేస్తుండగా బైక్ జారిపడి ప్రమాదం సంభవించింది.

VIDEO: https://x.com/i/status/1814922822835450174

హైటెక్ సిటీ, గచ్చిబౌలి మరియు ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బైక్ స్టంట్లు జరుగుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న రోడ్లపై కూడా యువకులు బైక్ రేసింగ్‌లలో మునిగిపోతారు. మూడు పోలీసు కమిషనరేట్‌లలో పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ, కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, సమస్య అలాగే ఉందని, ఇతరరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పౌరులు అంటున్నారు.

Also Read: NBK109 : బాలయ్యకి జోడిగా మరోసారి ఆ నటి.. పవర్‌ఫుల్ పాత్రలో ఊర్వశి రౌటెలా..!

Follow us