Site icon HashtagU Telugu

Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

Charminar Damaged

Charminar Damaged

Charminar Damaged: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం (ఏప్రిల్ 3, 2025) సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక ప్రమాదం తప్పింది. గంటసేపు కురిసిన జోరు వర్షంతో చార్మినార్‌లోని ఒక మీనార్ నుంచి పెచ్చులు (Charminar Damaged) ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మీనార్‌లో చివరి భాగంలోని కొన్ని డిజైన్లు రాలిపోయాయి. ఈ సమయంలో పర్యాటకులు, స్థానికులు అక్కడ ఉన్నప్పటికీ.. ఎవరిపైనా శిథిలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వర్షం ధాటికి ఈ ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఊడిన పెచ్చులను తొలగించి, ప్రాంతాన్ని శుభ్రం చేశారు. గతంలో రిపేర్ చేసిన భాగాలే మళ్లీ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు, పర్యాటకులు కొంత భయాందోళనకు గురయ్యారు. కానీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ప్రసిద్ధ చారిత్రక స్మారకం చార్మినార్

చార్మినార్ హైదరాబాద్ నగరంలోని ఒక ప్రసిద్ధ చారిత్రక స్మారకం. తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపుగా నిలుస్తుంది. 1591లో కులీ కుతుబ్ షా దీనిని నిర్మించాడు. ఈ నాలుగు మీనార్ల నిర్మాణం 56 మీటర్ల ఎత్తుతో ఇస్లామిక్, భారతీయ శైలుల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. దీని పేరు “చార్” (నాలుగు).. “మీనార్” (మీనార్లు) అనే పదాల నుంచి వచ్చింది.

Also Read: Fire Accident : ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..ఏదైనా కుట్ర ఉందా..?

చార్మినార్ చుట్టూ లాడ్ బజార్, మక్కా మసీదు వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది ప్లాస్టర్, గ్రానైట్, సున్నపురాయితో నిర్మితమై నగరంలోని పాత ప్రాంతంలో కేంద్ర బిందువుగా ఉంది. రాత్రి వేళల్లో లైటింగ్‌తో దీని అందం మరింత ఆకట్టుకుంటుంది.