TSPSC Group 4 Rules: గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే హిందూ మహిళలపై కమిషన్ ఆంక్షలు విధించింది. శనివారం జరగనున్న గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే మహిళలు గాజులు, ముక్కు పుడక, చెవిపోగులు తొలగించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హెచ్చరించింది. అయితే కమిషన్ చర్యను విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ తీవ్రంగా తప్పుబట్టాయి. మహిళా అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటపుడు గాజులు, ఇతర ఆభరణాలు తీయమని చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రచారకర్త పగుడాకుల బాలస్వామి అన్నారు. సంబంధిత అధికారులు ముస్లిం మహిళలకు జోలికి ఎందుకు వెళ్లరని ఆయన ప్రశ్నించారు.
హిజాబ్ లేదా బుర్కా ధరించిన ముస్లిం మహిళలను పట్టించుకోకుండా కేవలం హిందూ మహిళలకే ఎందుకు ఇన్ని ఆంక్షలు అంటూ మండిపడ్డారు. పరీక్ష హాలులో ఎవరైనా నగలు తీయమని అడిగితే హిందూ మహిళలు తిరుగుబాటు చేయాలని సూచించారు బాలస్వామి. ఈ విషయంలో ఎవరికైనా ఎక్కడ ఏ సమస్య వచ్చినా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. తాజాగా ముస్లిం మహిళకు ఇదే సమస్య ఎదురైతే తెలంగాణ హోంమంత్రి ఆ మహిళకు మద్దతుగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఓ ముస్లిం విద్యార్థిని పరీక్ష రాస్తున్న సమయంలో హిజాబ్‌ను తొలగించాలని కళాశాల యాజమాన్యం కోరడంతో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వయంగా జోక్యం చేసుకుని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారని బాలస్వామి తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్‌లోని ఓ పాఠశాలలో పరీక్ష సమయంలో బాలికలను హిజాబ్ విప్పమని కోరినందుకు పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైందని బాలస్వామి అన్నారు.
ఇదిలా ఉండగా TSPSC గ్రూప్-4 పరీక్షను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుపటిలా పేపర్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతుంది. ఇందుకోసం కఠిన నిర్ణయాలకు పాల్పడుతుంది కమిషన్. కాగా.. రేపు జరగబోయే పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. TSPSC గ్రూప్-4 పరీక్ష శనివారం అంటే జూలై 1న జరగనుంది.
Read More: Uttar Pradesh: పది రూపాయల కోసం దుకాణదారుడు ని కాల్చిన దుండగులు?