Site icon HashtagU Telugu

Vani Enugu: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం కొత్త అధ్యక్షురాలిగా వాణి ఏనుగు ఎంపిక!

Vani Enugu

Vani Enugu

Vani Enugu: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) కొత్త అధ్యక్షురాలిగా వాణి ఏనుగు (Vani Enugu) ఎంపికయ్యారు. స్థానిక రాడిసన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నైటా కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది. న్యూయార్క్‌లో ఉంటున్న ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై, కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో అతిపెద్ద నగరానికి, తెలంగాణకు వారధిగా ఉన్న న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం కొత్త అధ్యక్షురాలిగా వాణి ఏనుగు, సెక్రటరీగా హరిచరన్ బొబ్బిలి, వైస్ ప్రెసిడెంట్ గా రవీందర్ కోడెల, ట్రెజరర్‌గా నరోత్తమ్ రెడ్డి బీసమ్ ఎన్నికయ్యారు. న్యూయార్క్ కాంగ్రెస్ మెన్ థామస్ రిచ్చర్డ్ సౌజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, కొత్త కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

నైటా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేస్తానని, కార్యవర్గం మొత్తం తెలుగు కమ్యూనిటీని కలుపుకుని కార్యక్రమాల నిర్వహణ చేపడతామని వాణి ఏనుగు తెలిపారు. న్యూయార్క్ మహానగరంలో నివసించే తెలుగు వారికి ఒక వేదికగా, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అమెరికాలోనూ అందించాలన్నఉద్దేశ్యంతో న్యూయార్ తెలంగాణ తెలుగు సంఘం ఏర్పాటైంది. ప్రతీ యేటా కమ్యూనిటీ కార్యక్రమాలు, సంస్కృతీ సంప్రదాయాలు, పండగలు, వేడుకలను నిర్వహణలో భాగం అవుతూ నైటా ఎనలేని కృషి చేస్తోంది.

Also Read: Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?

అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, గూడూరు శ్రీనివాస్, నైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ ఏనుగు, సతీష్ కాల్వ, అడ్వయిజరీ కమిటీ సభ్యులు తమ కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరై, కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా సుంకిశాలలో జన్మించిన వాణి, తమ తాత పైళ్ల సత్యనారాయణ రెడ్డి వద్ద హైదరాబాద్ లో చదువుకున్నారు. ఏనుగు లక్ష్మణ్ తో వివాహం తర్వాత మల్లారెడ్డి సహకారంతో పాతికేళ్ల కిందట అమెరికా చేరుకున్నారు. భార్యగా, తల్లిగా, ఫార్మసిస్ట్‌గా త్రిపాత్ర అభినయం చేయటమే కాదు.. భారతదేశం నుంచి న్యూయార్క్ వచ్చే అతిధులు, తెలంగాణ కవులు, కళాకారులకు ఆతిధ్యం ఇచ్చి, అన్నం పెట్టడం వాణి ఏనుగు ప్రత్యేకత.

Exit mobile version