Site icon HashtagU Telugu

Uttam Kumar Reddy : ఢిల్లీ లో సోనియా ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్

Uttam Soniya

Uttam Soniya

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)..బుధువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పనితీరు కనపరిచినందుకు గాను ఆమెను అభినందించడం జరిగింది. అలాగే మొదటిసారి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించినందుకు గాను ఉత్తమ్ సంతోషం వ్యక్తం చేసారు. ఇక రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్‌ నుంచి కూడా గెలుపొందినప్పటికీ, ఇటీవల ఆ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తొలిసారి లోక్‌సభలో స్పీకర్‌పై పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి పోటీ చేసింది. చివరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో రెండోసారి ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అయితే ఓం బిర్లా.. స్పీకర్ సీటులో కూర్చోగానే ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీని గుర్తుచేసుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనతో విపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా తీరును తప్పుపట్టాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

Read Also : Kalki 2898 AD : ‘కల్కి’ టీం కు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ