ములుగు జిల్లా దేవాదుల గ్రామంలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ & పంపింగ్ స్టేషన్‌ను (Devadula Project ) నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) సందర్శించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ..2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, శ్రీమతి సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని, పొరుగు రాష్ట్రాల తో సత్ సంబంధాలతో త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ప్రభుత్వం కేవలం పనులు చేసి, జేబులు నింపుకున్నారు కానీ ప్రజలకు లాభం జరగలేదు. లక్ష 80 వేల కోట్లు ఇరిగేషన్ శాఖ పైనా ఖర్చు చేసి జేబులు నింపుకున్నారని, ప్రతి ప్రాజెక్టులోను వేలకోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. 1.81 లక్షల కోట్ల నిధులను ఇరిగేషన్ శాఖకు ఖర్చుచేసినా లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారన్నారు. 14 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంటే, 7వేల కోట్లను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందన్నారు ఉత్తమ్. ప్రస్తుతం 38 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి ప్రాజెక్ట్ డిజైన్ చేశారని ప్రస్తుతం సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు. 300 రోజులపాటు 60 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఉత్తమ్ వెంట జిల్లా ఇంచార్జి దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, యశస్విని, మురళీనాయక్, గండ్ర సత్యనారయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, చైర్మన్ ఇ.వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Also : Gudlavalleru Engineering College : సెలవులు ప్రకటించిన యాజమాన్యం