Site icon HashtagU Telugu

BRS: బీఆర్ఎస్​కు షాక్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి రాజీనామా

Uppal former MLA Bethi Subhash Reddy resigned from BRS party

Uppal former MLA Bethi Subhash Reddy resigned from BRS party

Former MLA Beti Subhash Reddy: లోక్​సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి( Beti Subhash Reddy), బీఆర్ఎస్​కు రాజీనామా(resignation)చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్​కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హర్​దీప్​సింగ్ పూరి సమక్షంలో బీజేపీలోకి చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారని సుభాష్ రెడ్డి లేఖలో ఆరోపించారు. లక్ష్మారెడ్డి అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్లలేనని బీఆర్ఎస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు.

Read Also: WhatsApp Chat Filters: వాట్సాప్ ఛాట్‌లను వడపోసే.. మూడు ఫిల్టర్లు..!

బీజేపీ మాత్రం ఉద్యమకారుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకే, అవకాశవాది కోసం కాకుండా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ ను గెలిపించేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈమేరకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గురువారం లేఖ రాశారు. ఈ లేఖను బేతి సుభాష్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also: Nestle – Cerelac : పిల్లలకు సెరెలాక్ ఇస్తున్నారా ? అందులో చక్కెర మోతాదుపై సంచలన రిపోర్ట్

బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే బీజేపీలోకి చేరిన వారిలో జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్, నాగర్​కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు భరత్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (వరంగల్ స్థానం), హుజుర్​నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(నల్గొండ స్థానం) తదితరులు పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.