Bjp Janagarjana Sabha: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అధికార కుర్చీ కోసం మూడు పార్టీలు కాచుకుని కూర్చున్నాయి. తన కుర్చీని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 6 హామీలంటూ తెరపైకి వచ్చింది. ఇక బీజేపీ కెసిఆర్ ని గద్దె దించేందుకు సన్నాహక రాజకీయాలకు కాలు దువ్వుతుంది. దీంతో దేశ రాజకీయాలందు తెలంగాణ రాజకీయాలు వేరయా అన్న చందంగా మారింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహాలతో బీజేపీ అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. కేంద్రం అమలుచేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన నిధుల లెక్కలను బహిర్గతం చేస్తూ ఓటు బ్యాంకును సాధించుకునేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదని బీజేపీ కూడా పోరాడిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లోని జమ్మికుంటలో బీజేపీ జన గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు సంధించారు. రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతం కోసం రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది పోరాడారని కేంద్ర మంత్రి చెప్పారు.
గుజరాత్‌లో బీజేపీ రెండున్నర దశాబ్దాలకు అధికారంలో ఉందని అయన అన్నారు. దేశంలో గుజరాత్ అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. అయితే పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి కాలేదో కేసీఆర్ చెప్పాలని మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ఎద్దేవా చేశారు.
Also Read: TCongress: అధికారమే లక్ష్యంగా రాహుల్, ప్రియాంక ప్రచార పర్వం, విజయ భేరి పాదయాత్రతో శ్రీకారం!