Site icon HashtagU Telugu

Kishan Reddy : పూలబొకేలు, శాలువాలు, స్వీట్లు తేవొద్దు.. ఆ ఒక్క పని చేయండి : కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : గంగాపురం కిషన్‌ రెడ్డి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. సికింద్రా బాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆయనను మరోసారి ఆ గొప్ప అవకాశం వరించింది. ఆదివారం రాత్రి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డికి కీలకమైన మంత్రిత్వ శాఖ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర మంత్రి అయిన సందర్భంగా తనను కలవడానికి వచ్చే మిత్రులు, శ్రేయోభిలాషులకు కిషన్ రెడ్డి (Kishan Reddy) ముఖ్యమైన సూచన చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు దయచేసి పూల బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకురావొద్దని ఆయన కోరారు.  తన కోసం పూల బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకొచ్చే బదులుగా.. వారివారి నివాస ప్రాంతాల సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్‌లు, స్ఫూర్తిదాయక కథల పుస్తకాలను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సందేశంతో ఆయన పెట్టిన ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. కిషన్ రెడ్డి చాలా గొప్ప సందేశం ఇచ్చారని.. ఆయన స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. కేంద్ర మంత్రులైన మిగతవారు కూడా కిషన్ రెడ్డి తరహా సందేశమే ఇవ్వాలని కోరుతున్నారు. రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్‌గా కిషన్ రెడ్డి మారారని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. 

Also Read : CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు

తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయ్ : కిషన్ ‌రెడ్డి

ఇక సోమవారం ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. గత ఐదేళ్లలో మేం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు తెచ్చాం. మేం తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదు’’ అని ఆయన తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో తెలంగాణలోని 88 అసెంబ్లీ సీట్లే మా టార్గెట్. రాష్ట్రంలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తాం. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.