Mahakumbh Trains : మహాకుంభ మేళా చాలా స్పెషల్. ఈ మేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేయాలని చాలామంది భావిస్తుంటారు. ఇందుకోసం ఎంతోమంది భక్తజనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమానికి తరలి వెళ్తున్నారు. ఈ తరుణంలో రైల్వేశాఖ నుంచి షాకింగ్ అలర్ట్ బయటికి వచ్చింది.
Also Read :Indian Elections Vs Trump : బైడెన్ రూ.182 కోట్లు.. భారత్‌లో ఎవర్నో గెలిపించాలనుకున్నారు : ట్రంప్
కాశీ, ప్రయాగ్ రాజ్ తప్ప..
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఎంతోమంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఎక్కి ప్రయాగ్‌రాజ్‌కు పయనమవుతున్నారు. ఈనెల(ఫిబ్రవరి) 26 వరకు మహాకుంభ మేళా కొనసాగనుంది. అప్పటివరకు మరింత మంది తెలుగు రాష్ట్రాల భక్తులు ప్రయాగ్ రాజ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అనూహ్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, కాశీ నగరాల మీదుగా బిహార్‌కు వెళ్లే దానాపుర్ ఎక్స్‌ప్రెస్ (12791), అటు నుంచి వచ్చే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12792)లను ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు రద్దు చేసింది. రద్దు చేసిన ఈ రెండు రైళ్లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు చర్లపల్లి, నల్గొండ, విజయవాడ, భువనేశ్వర్, పట్నా మీదుగా దానాపుర్ వరకు నడపనున్నారు. అయితే ఇవి ప్రయాగ్ రాజ్, కాశీ మీదుగా వెళ్లవు. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్, కాశీలకు వెళ్లే ఏకైక రెగ్యులర్ రైలు ఇదే. దీన్ని కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు స్పందించాలని, హిందూభక్తుల మనోభావాలను కాపాడేందుకుగానూ ఆయా రైల్వే సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Also Read :Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
ఈ రూట్‌లో రాకపోకలు..
చర్లపల్లి- దానాపూర్ (07791) ప్రత్యేక రైలు ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్‌కు చేరుతుంది. ఈ రైలు ఉదయం 4.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.