Unemployed Protest : సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన..

నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని సీఎం రేవంత్ కు తెలిసిన కూడా అదే తప్పు చేస్తున్నారని వారంతా హెచ్చరిస్తున్నారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 01:52 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) మరోసారి నిరుద్యోగుల నిరసనలు (Unemployed Protest) ఉదృతం అవుతున్నాయి. గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుందని..నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని సీఎం రేవంత్ కు తెలిసిన కూడా అదే తప్పు చేస్తున్నారని వారంతా హెచ్చరిస్తున్నారు.

అధికారంలోకి రాగానే మెగా DSC ..జాబ్స్ నోటిఫికేషన్..అంటూ ఎన్నో చెప్పిన కాంగ్రెస్ ..ఈరోజు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం తో నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గాంధీ ఆస్ప‌త్రిలోనూ దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిరుద్యోగులు నిర‌స‌న చేప‌ట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని ఆర్ట్స్ కాలేజీ ముందు ధ‌ర్నాకు దిగారు.

ఇటు సీఎం రేవంత్ సొంత జిల్లాలో కూడా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి సీఎం కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దీ రోజులుగా మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఏ కాంగ్రెస్ నేత కూడా పట్టించుకోవడం లేదని..నిరుద్యోగులంటే లెక్కలేదని ..ఓ పక్క నిరుద్యోగులంతా రోడ్లపైకి వస్తే..కనీసం మాట్లాడదామనే ఆలోచన కూడా సీఎం చేయడం లేదని..బిఆర్ఎస్ నేతలను చేరుకొనే పనిలో తప్ప ప్రజల సమస్యలు , నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ఇటు గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోతీలాల్ నాయ‌క్ గాంధీ ఆస్ప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మోతీలాల్ నాయ‌క్‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆయా పార్టీల నేత‌లు, ఉద్య‌మ‌కారులు గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. కానీ వీరిని పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుంటున్న వారిని వెంట‌నే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లిస్తున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇక నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి అంటే ..

-గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
-గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
-జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
-25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.

Read Also : Polavaram Project : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని..సీఎంను ప్రశ్నించిన మహిళ