Site icon HashtagU Telugu

Osmania Hospital : ఉస్మానియా లో కరోనా తో ఇద్దరు మృతి

Corona Dies

Corona Dies

దేశ వ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి బుసలుకొడుతుంది. పోయిందాలే అని అనుకున్నామో..లేదో మళ్లీ నేనున్నాను అంటూ చెప్పకంటే చెపుతుంది. చేప కింద నీరులా కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతుంది. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా (India) కొత్తగా 628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ జేఎన్1 భయపడుతోంది. ఇప్పటికే కేంద్రం కరోనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ విషయానికి వస్తే..రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కేసులు మాత్రం వెలుగులోకి రాగ..తాజాగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషంట్లు మృతి చెందారు. ఆసుపత్రిలో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్సకు చేరారు వారిద్దరు. అనంతరం వారికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో ఒకరికి 60, మరొకరికి 42 సంవత్సరాలు. వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వీరి పరిస్థితి విషమించి రోగి మృతిచెందినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. మరో రోగి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వారిద్దరికీ కరోనా ఉన్నట్లు అనంతరం తేలిందని నాగేంద్ర చెప్పుకొచ్చారు. అలాగే ఆసుపత్రిలో మరో ఇద్దరు పీజీ మెడికోలకు కూడా పాజిటివ్ వచ్చిందని, వారు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు.

Read Also : Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు