Two municipal workers Dead: కారు బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి

మెదక్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి (Dead)చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

మెదక్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి (Dead)చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న Ts 35 F 9766 ఆల్టో కారు అయిదుగురు పారిశుధ్య కార్మికులను ఢీకొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికి అక్కడే మృతి చెందింది.

Also Read: Three dead: సెంట్రల్ ప్యారిస్‌లో కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి

చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించడంతో చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సిఐ విజయకుమార్, ఎస్ఐ మల్లారెడ్డి, ఎస్ఐ విట్టల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకేసారి ఇద్దరు మున్సిపల్ కార్మికులు చనిపోవడంతో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగుడారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని కారుని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. మృతిచెందిన మహిళల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  Last Updated: 24 Dec 2022, 11:31 AM IST