Sheep Distribution Scam: తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో సబ్లావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు. వీళ్ళు మోసపూరిత చర్యలకు పాల్పడటం ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణల నేపథ్యంలో దాదాపు 2.1 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తుంది.
గొర్రెల యూనిట్ల ఎంపిక, కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అవకతవకలకు పాల్పడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడేలా ఇద్దరు అధికారులు తమ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చెవి ట్యాగ్, అలాగే గొర్రెల రవాణా కోసం అంబులెన్స్‌లు, ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలను అక్రమంగా ఉపయోగించడం వంటి అక్రమాలు జరిగాయని తెలుస్తుంది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో గతేడాది డిసెంబర్ 10న పశుసంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ పత్రాలు, ఫైళ్లు కనిపించకుండా పోయాయి. ఈ ఫైళ్లను గత బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు మాయం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబందించి ప్రభుత్వం వద్ద అధరాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అరెస్టు చేసిన ఇద్దరు అధికారులను నాంపల్లి కోర్టులో ఏసీబీ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Also Read: Summer: సమ్మర్ లో ఏటైమ్ లోవాకింగ్ చేయాలో మీకు తెలుసా