Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు – పొంగులేటి

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantee Scheme) అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..ఇచ్చిన మాట ప్రకారం..అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం , అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 […]

Published By: HashtagU Telugu Desk
Ponguleti

Ponguleti

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantee Scheme) అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..ఇచ్చిన మాట ప్రకారం..అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం , అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రజల్లో సంతోషం నింపారు. అలాగే ప్రజా భవన్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మరో ఆరు నెలలో మెగా డిస్సీ ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే తరుణంలో ప్రజలకు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మరో తీపి కబురు తెలిపారు. సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్యలు తీసుకుంటామన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని , అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టేది లేదని , బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టం అని తేల్చి చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ధరణిలో తప్పులు ప్రక్షాళన చేసి నష్టం లేకుండా చేస్తామన్నారు.

Read Also : Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

  Last Updated: 18 Dec 2023, 03:56 PM IST