తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌ను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. అనుమతి లేకుండా ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నారని ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించి హైదరాబాద్‌కి చెందిన వారుగా గుర్తించారు. అనంతరం ఎస్పీఎఫ్ సిబ్బంది డ్రోన్, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అనధికార డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపింది. ఆలయ ప్రాంగణాన్ని చిత్రీకరించేందుకు అనుమతి లేకుండా డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారని ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రోన్‌తో ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించబడింది.
Also Read: Viral Video: పుచ్చకాయను దొంగలించిన ఏనుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
కేంద్రం రూపొందించిన కొత్త డ్రోన్ నిబంధనల ప్రకారం.. ప్రత్యేకమైన UIN నంబర్, UAOP లైసెన్స్ పొందేందుకు డ్రోన్ వినియోగదారులు తమ పేరు, డ్రోన్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలి. ఈ క్రమంలో వాటికి ప్రత్యేక యూఐఎన్ సంఖ్య, యూఏఓపీ లైసెన్స్‌ను కేటాయిస్తారు. ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు యువకులు తమ డ్రోన్‌ను నమోదు చేశారా లేదా అని పోలీసులు ధృవీకరిస్తున్నారు.