కాసేపట్లో గద్దెపైకి సమ్మక్క వస్తున్న తరుణంలో మేడారం మహా జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) గుండెపోటుతో మరణించగా… కామారెడ్డికి చెందిన సాయిలు జంపన్న వాగులో స్నానం చేస్తూ చనిపోయాడు. దీంతో జాతరలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక మేడారం సమక్క(Sammakka) – సారక్క మహా జాతర (Medaram Maha Jatara) కీలక ఘట్టానికి చేరింది. తల్లుల దర్శనానికి అనేక రాష్ట్రాల భక్తులు పోటెత్తారు. ఎటు చూసిన జనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపో యాయి. మరికాసేపట్లో సమ్మక్క మేడారం గద్దెలపై కొలువుదీరబోతున్నది. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క చిలుకలగుట్ట దిగి జనం జనం మధ్యలోకి రాబోతుంది. ఈ సందర్భంగా సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు మేడారానికి బయలుదేరారు. ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను గద్దెపైన కొలువుదీర్చనున్నారు. మరో వైపు సమ్మకు స్వాగతం పలుకుతూ దారి పొడువునా మహిళలు ముగ్గులను అలంకరించారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా మేడారంలో భక్తుల దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతున్నది. ఇక మేడారం జాతరకు వస్తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. వైద్య బృందాలు, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ(RTC) మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు భారీగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇదిలా ఉంటె జాతరలో భక్తుల రద్దీ పెరగడంతో జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. గద్దెలు, జన సమూహాలను ఎంచుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం ఆదమరిచినా బంగారు ఆభరణాలు, డబ్బులు, చరవాణులను దొంగిలిస్తున్నారు. హెల్ప్‌డెస్క్‌లు, తప్పిపోయిన శిబిరాల వద్దకు బాధితులు పరుగులు తీసినా ఫలితం లేకుండా పోతోంది. కనీసం సీసీ కెమెరాల్లో చూసి వెతికేందుకు కూడా ప్రయత్నం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
Read Also : Payal Rajput Mangalavaram : బుల్లితెర మీద మంగళవారం అదిరిపోయే రేటింగ్..!