KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ చౌగొని రజిత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఏముంది ?
మార్చి 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్న పదో తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. ఈ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR) ఫార్వర్డ్ చేశారని రజిత శ్రీనివాస్ ఆరోపించారు. ఆ పోస్టులను ఫార్వర్డ్ చేస్తూ ‘ఎక్స్’ వేదికగా తమపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఏ1గా మన్నే క్రిశాంక్, ఏ2గా కేటీఆర్, ఏ3గా దిలీప్‌కుమార్‌ల పేర్లను నమోదు చేశారు. ఇదే అంశంపై ఉగ్గడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది.
Also Read :OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
మార్చి 21న ఏం జరిగింది ?
ఇంతకీ విషయం ఏమిటంటే.. మార్చి 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. చివరకు అది డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. ఈ 11 మంది స్నేహితులని పోలీసులు గుర్తించారు. మార్చి 21న వీరంతా ప్లాన్ ప్రకారమే అంతా చేశారు. ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై చేరుకున్నారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోపలకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ వేచి చూస్తున్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు. ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థినితో మాట్లాడి.. ప్రశ్నపత్రం చూపించమని సైగ చేశాడు. అతడి వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని వెంటనే ప్రశ్నపత్రం చూపించింది. సదరు బాలుడు తన ఫోన్‌లో ఆ ప్రశ్నాపత్రం ఫొటో తీసుకొని కిందికి దిగాడు. దాన్ని వాట్సాప్‌లో మిగతా నిందితులకు పంపాడు. వారంతా ఒకరికి ఒకరు సెండ్ చేసుకున్నారు. ఈ పేపరులో ఉన్న ప్రశ్నలకు ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేశాడు. వాటిని రవిశంకర్ జిరాక్స్ షాప్‌లో జిరాక్స్ తీశారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారని పోలీసులు వెల్లడించారు.
🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings –
Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups…
While 15 people have been involved,
only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025