KTR Help:అనాథలైన పదేళ్ల చిన్నారులను ఆదుకోవాలన్న కేటీఆర్

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాల‌నీకి చెందిన అనప‌ర్తి ఉపేందర్, తిరుప‌త‌మ్మ‌ దంపతులు ఒకేసారి చనిపోయారు.

  • Written By:
  • Publish Date - November 22, 2021 / 11:37 PM IST

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాల‌నీకి చెందిన అనప‌ర్తి ఉపేందర్, తిరుప‌త‌మ్మ‌ దంపతులు ఒకేసారి చనిపోయారు. ఉతికిన బట్టలను కరెంట్ వైర్ పై ఆరేస్తుండగా తిరుపతమ్మకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడడానికి తన భర్త ఉపేందర్ వెళ్లగా అయన కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన దంప‌తుల‌కు శ్యామ‌ల‌,బిందు అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ఉన్నారు.
కరెంట్ షాక్ తో చనిపోయిన తమ తల్లితండ్రుల అంత్య‌క్రియ‌ల‌ను ఆ చిన్నారులే నిర్వహించారు. పదిసంవత్సరాలు కూడా లేని ఆ పిల్లలు తమ త‌ల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టిన తర్వాత తాము అనాధలమయ్యామని బోరున విల‌పించారు.

https://twitter.com/KTRTRS/status/1462648187441668096

ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ చిన్నారుల‌ను ఆదుకోవాల‌ని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ కోరారు. పిల్లల బాధ్యతను చూసుకోవాలని తెలంగాణ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారుల‌తో పాటు, మ‌హ‌బూబాబాద్ జిల్లా కలెక్ట‌ర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.