Site icon HashtagU Telugu

Telangana: తుమ్మల హెచ్చరికలు.. నెల రోజుల్లో అధికారంలోకి

Tummala

Tummala

Telangana: తెలంగాణ పోలీస్ అధికారుల్ని హెచ్చరించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల పోలీస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అధికారం కోల్పోయే నాయకుల కోసం పని చేసి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు.

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. వినూత్న కార్యక్రమాలను ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్నారు. అందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ చేస్తున్న అరాచకం ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులను కేసీఆర్ ప్రయివేటు సైన్యంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

పోలీసులు కాంగ్రెస్ నాయకుల్ని ఇబందులకు గురి చేస్తున్నారు. బెదిరింపులు, దౌర్జన్యంతో భయపెడుతున్నారన్నారు. కొంతమంది పోలీస్ లు పరిధి దాటి కాంగ్రెస్ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఖమ్మంలో అరాచక పాలనను తరిమి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నెల రోజుల్లో అధికారం కోల్పోయే వారి కోసం పని చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు. హద్దులు దాటితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరానని తుమ్మల తెలిపారు.

Also Read: Chandrababu : చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలంటూ కోర్ట్ లో పిటిషన్

Exit mobile version