Electricity Tariff Hike : గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరైతే విద్యుత్ ఛార్జీల పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టటమే తరువాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వార్తలపై టీజీఎస్పీడీసీఎల్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. టీజీపీఎస్సీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజయ్యారు.
Read Also:KL Rahul: ఢిల్లీ కోసం రిస్క్ తీసుకుంటున్న కేఎల్ రాహుల్!
టీజీఎస్పీడీసీఎల్ కూడా విద్యుత్ పెంపుపై క్లారిటీ ఇవ్వటంతో ఈఏడాది ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమవుతోంది. దీంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకోనున్నారు. అయితే విద్యుత్ సంస్థలు క్లారిటీ ఇవ్వటంతో ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమైపోయింది. దీంతో సామాన్యులు కాస్త ఉపశమనం పొందినట్టయింది. కాగా, వేసవికాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలలో ఎండలు దంచికొడుతుండటంతో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
Read Also: Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!