TSRTC Jobs : డిగ్రీ చదివిన వారికి టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగ అవకాశమిది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(TSRTC Jobs) రిలీజైంది. హైదరాబాద్ రీజియన్‌లో 26, సికింద్రాబాద్ రీజియన్‌లో 18, మహబూబ్‌నగర్ రీజియన్‌లో 14, మెదక్ రీజియన్‌లో 12, నల్లగొండ రీజియన్‌లో 12, రంగారెడ్డి రీజియన్‌లో 12, ఆదిలాబాద్ రీజియన్‌లో 09, కరీంనగర్ రీజియన్‌లో 15, ఖమ్మం రీజియన్‌లో 09, నిజామాబాద్ రీజియన్‌లో 09, వరంగల్ రీజియన్‌లో 1 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ నాన్ ఇంజినీరింగ్ పోస్టులే. ఈ పోస్టులకు అప్లై చేసే వారు బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ చేసి ఉండాలి. 2018 నుంచి 2023 సంవత్సరాల మధ్య పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16లోగా దరఖాస్తులను సమర్పించాలి.
We’re now on WhatsApp. Click to Join.
పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ధ్రువ పత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మొదటి ఏడాది నెలకు రూ.15 వేలు, రెండో ఏడాది నెలకు రూ.16 వేలు, మూడో ఏడాది నెలకు రూ.17 వేల చొప్పున ప్రతినెలా స్కాలర్‌షిప్ ఇస్తారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.inను చూడొచ్చు.
Also Read :Soldier Firing : ఆరుగురు తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఆ వెంటనే సూసైడ్
గత ప్రభుత్వ హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తమను చిన్న కారణాలతో తొలగించారని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొందరు బుధవారం తెల్లవారుజామునే సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలతో తమను సస్పెండ్ చేసి, మెమో ఇచ్చి, జీతాలు కట్ చేసినట్టు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తమ గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని వారు ఈసందర్భంగా సీఎంను కోరారు.